రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దుర్మరణం

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. యాచారం మండలం, నందివనపర్తి గ్రామానికి చెందిన భూపతి దాసు వెల్డంద పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిభట్ల సర్కిల్‌ పరిధిలోని తుర్కయంజాల్‌లో నివాసం ఉంటున్నారు. నిత్యం తన బుల్లెట్‌ బైక్‌పై స్కూల్‌కు వెళ్లి వస్తుండేవాడు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో తుక్కుగూడ నుంచి తుర్కయంజాల్‌ వస్తుండగా కొంగరకలాన్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలో బైక్‌ అదుపుతప్పి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతని కుమారు ప్రేమ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని చూడగా భూపతి దాసు (50) అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసుల సాయంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement