రైతులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

కేశంపేట: దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు, సబ్సిడీలు ప్రకటిస్తుందని, ప్రస్తుతం రైతులు విపత్కర పరిస్థితిలో ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంయాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని ఇప్పలపల్లి, వేములనర్వ గ్రామాల్లో వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో ఎండిపోయిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరువు నేపథ్యంలో పెట్టుబడులు సైతం చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు, ప్రకటనలకే పరిమితమవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో వర్షపాతం తగ్గిపోయి, భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని సగం మండలాలనే కరువు ప్రాంతాలుగా గుర్తించడం దారుణమన్నారు. ఈ ఎంపిక శాసీ్త్రయంగా లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య రామస్వామి, యాదిరెడ్డి, బుద్దుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

లెక్కలు, ప్రకటనలకే పరిమితమవడం సిగ్గుచేటు

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంయాదవ్‌

పలు గ్రామాల్లో ఎండిన పంటల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement