ఆమనగల్లు: పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యా ప్తును వేగిరం చేయాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకిరెడ్డి కోరారు. నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితులు, పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ, మహిళల భద్రత, ఫిర్యా దులు, వారెంట్లు, స్టేషన్ పరిపాలనకు సంబంధించిన అంశాలపై సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే దసరా సంబరాల కోసం స్థల పరిశీలన చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సంతోష్ కుమార్‌రెడ్డి ఉన్నారు
నీటి పొదుపు మేలు
Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM
నీటి పొదుపు మేలు
మంచాల: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ అన్నారు. మండలంలోని ఆరుట్లలో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను వినియోగిస్తున్న రైతులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీటిని నేరుగా వేరు భాగాలకు అందించడం జరుగుతుందని, తద్వారా నీటి వినియోగం తగ్గుతుందన్నారు. పంట పెరుగుదల దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలు అందించాలన్నారు. నేలతేమ, పంట అవసరాలకు అనుగుణంగా నీటి పారుదల ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. డ్రిప్ వ్యవస్థలోని ఫిల్టర్లు, పైపులు, డ్రిప్పర్ల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ఉద్యాన శాఖ అధికారి నవీన, విస్తరణాధికారి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఎంప్లాయీస్ నూతన నియామకం
చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శిగా వి.కృష్ణయ్య ఎంపికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనను ఎంపిక చేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శుక్రవారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికై న కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన ఆర్ కృష్ణయ్యకు, సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్‌కుమార్, బీసీ ఎంప్లాయీస్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం
సహించేది లేదు
శంకర్పల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. మోకిల పోలీస్ స్టేషన్‌ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బంది, పరిసరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, బాధితులకు ఉపశమనం కలిగించాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మోకిల సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
కేసుల దర్యాప్తు వేగిరం చేయాలి
Advertisement


