వైభవంగా బతుకమ్మ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా బతుకమ్మ సంబురాలు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

వైభవంగా బతుకమ్మ సంబురాలు

కడ్తాల్‌: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో చూడ ముచ్చటగా అలంకరించిన బతుకమ్మలను పలు కాలనీల మీదుగా ర్యాలీ నిర్వహించి గాంధీనగర్‌ రచ్చబండ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆటపాటలతో హోరెత్తించారు. ప్రముఖ గాయని మధుప్రియ బృందం తమ పాటలతో అలరించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న నాయకులు

పాటలతో అలరిస్తున్న గాయని మధుప్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement