సందడిగా మేకల సంత | - | Sakshi
Sakshi News home page

సందడిగా మేకల సంత

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

సందడిగా మేకల సంత

త్వరగా అమ్ముడుపోయాయి

● దసరా వేళ పెరిగిన డిమాండ్‌

● జోరుగా సాగిన క్రయవిక్రయాలు

● జీవాలు పోషించుకునే రైతులకు కలిసొచ్చిన సీజన్‌

చేవెళ్ల: జీవాలను పోషించుకునే రైతులకు దసరా పండుగ సీజన్‌ కలిసొచ్చింది. మేకలు, గొర్రెలకు డిమాండ్‌ పెరగడంతో చేవెళ్లలో శుక్రవారం నిర్వహించిన మేకల సంత సందడిగా మారింది. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయం కావడంతో కొనుగోళ్లు పెరగడం, ధరలు మెరుగ్గా ఉండటంతో జీవాల పెంపకంపై ఆధారపడిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సంతకు చేవెళ్ల పరిసర ప్రాంతాల రైతులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యాపారులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చారు. పండుగ అవసరాలకోసం మేకపోతులు, గొర్రె పొట్టేళ్ల కొనుగోళ్లపై ఆసక్తి కనిపించింది. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సీజన్‌ కావటంతో వ్యాపారం ఊపందుకుంది. పెరిగిన ధరలు కొంత మేర కలిసి వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

చేవెళ్ల సంతకు రెండు మేకలను తెచ్చాను. పండుగ సీజన్‌ కావడంతో త్వరగానే అమ్ముడుపోయాయి. ఒక్కోటి 8వేల రూపాయల చొప్పున విక్రయించాను.

– మల్లయ్య, రైతు, మాదారం, నవాబుపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement