మొయినాబాద్రూరల్: చేవెళ్ల నియోజకవర్గంలో పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు జిల్లా అడిషనల్ పీడీ సుభాషిణిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని తోల్కట్టలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు గురువారం వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ పింఛన్ అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పరిశీలన కోసం వచ్చే అధికారులకు దరఖాస్తు చేసుకున్న వారు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో విక్రాంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్గౌడ్, సురేందర్రావు, సర్పంచ్ రజితారవీందర్ పాల్గొన్నారు.


