నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం

Oct 16 2026 10:46 AM | Updated on Oct 16 2026 10:46 AM

చేవెళ్ల: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలం, మున్సిపల్‌ పరిధిలో గురువారం ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన మౌలిక సదుపాయలను మెరుపర్చడమే లక్ష్యంగా అభివృద్ధికి ప్రాధ్యానత ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తన నిధులతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి, నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి నిధులు సక్రమంగా కేటాయిస్తే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో సాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లు మీనాక్షి, మనీష, మాధవి, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ మల్గారి వైభవ్‌రెడ్డి, సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎస్‌ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement