షాద్‌నగర్: గౌరవమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అవమానకరంగా మాట్లాడడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీలు తాతా మధు, నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటడం, వ్యక్తిగత ధూషణలకు పాల్పడడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు రమేష్, బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి, రవికుమార్, జాంగారి జంగయ్య, పెంటనోళ్ల ఆంజనేయులు, సాయిలు, సురేందర్, జంగయ్య, శ్రీను, బాల్‌రాజ్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


