కొత్తూరు: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని ఓ హోటల్‌లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీసుశాఖ ప్రవేశపెట్టిన వెబ్‌సైట్‌లో అనుమతులు తీసుకోవాలన్నారు. విగ్రహాలను మండపాలకు తెచ్చే సమయంలో, నిమజ్జన సమయంలో ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతరులు ఇబ్బందులు పడేలా రోడ్ల మధ్య మండపాలను ఏర్పాటు చేయొద్దని తెలిపారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో డీజేలు పెట్టొద్దని సూచించారు. బలవంతపు చందాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నాగార్జునరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


