హామీల పేరుతో కాంగ్రెస్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

హామీల పేరుతో కాంగ్రెస్‌ మోసం

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. 8లోu

పక్కాగా సాగు లెక్క పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది.

తుర్కయంజాల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తుర్కయంజాల్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్‌లను ప్రకటించిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిన వాటి ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలను కోర్టుల్లో కేసులు వేయించి నిలిపివేయించారని అన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, అరాచకాలపై అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన శంకుస్థాపనలకు ప్రస్తుత ఎమ్మెల్యే రిబ్బన్‌లు కట్‌ చేస్తూ, ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తూ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కళ్యాణ్‌ నాయక్‌, నాయకులు బొక్క గౌతమ్‌ రెడ్డి, రొక్కం చంద్రశేఖర్‌ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్‌, మర్రి సంపతీశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement