రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం
కొత్తూరు: నిషేధిత హష్ హాయిల్ విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఎస్‌ఓటీ, కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన హెచ్.ధృవ్ అలియాస్ ధృవ్‌జోషి (30) ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఒడిశా నుంచి హష్ ఆయిల్ తెచ్చి కొత్తూరు పరిధిలో విక్రయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మంగళవారం ఇన్ముల్‌నర్వ శివారులో పీఅండ్‌జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధృవ్‌జోషి కనిపించాడు. అతని వద్ద ఉన్న బ్యాగులో సుమారు 11.319 కిలోల హష్ ఆయిల్‌ను గుర్తించారు. స్టేషన్‌కు తరలించి విచారించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ తీసుకొచ్చి కమీషన్ ప్రాతిపదికన విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు రూ.1.42 కోట్ల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


