రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్‌ ఇస్పాత్‌ ఐరన్‌ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని సమీపంలోని రైతులు అరుంధతి, కార్తీక్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ నారాయణరెడ్డి రెవెన్యూ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ, పీసీబీ, ఇండస్ట్రియల్‌, వ్యవసాయశాఖతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి షాద్‌నగర్‌ ఆర్డీఓ సరిత, వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయాధికారి సుజాత, పీసీబీ నుంచి సురేష్‌, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నుంచి జిల్లా అధికారి సురేష్‌, ఇండస్ట్రియల్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌ కలిసి ఐరన్‌ కంపెనీతో పాటు సమీపంలోని రైతుల వ్యవసాయ భూములు, వేసిన పంటలను పరిశీలించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో పంటలు, భూములు నాశనం అవుతున్నాయని రైతులు ఆరోపించారు. హైకోర్టు ఆదేశించినా కంపెనీని తరలించడం లేదని వాపోయారు. కమిటీ వెంట తహసీల్దార్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ విజయలక్ష్మి, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు. కమిటీ సభ్యులు కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement