ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సివిల్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికై న ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌ఓ మద్ది మహేందర్‌రెడ్డికి ఏసీపీ కేపీవీ రాజు, ఎస్‌ఐలు, సిబ్బంది మంగళవారం బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తుదారుల నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు డిపాజిట్ (ఈఎండీ)గా ఆన్‌లైన్ ద్వారా రూ.10 వేలు స్వీకరించారు. ఇళ్ల కేటాయింపు లాటరీ పూర్తి కావ డంతో ఎంపిక కాని దరఖాస్తుదారులకు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తుదా రులు చెల్లించిన అకౌంట్‌కే డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అయితే.. కొంతమంది దరఖాస్తుదారులు నగదు ద్వారా, ఇతరుల అకౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలా చెల్లించిన వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు చేశారో, అదే అకౌంట్‌కు తిరిగి జమ అవుతుందని తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికై న వారి వివరాల పరిశీలన కొనసాతోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని గౌతం వెల్లడించారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు పత్రాలను (అలాట్‌మెంట్)) అందజేస్తామన్నారు.


