పోరాటాలతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వస్తున్న వారు ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూ సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఈ విషయంలో నాటి కేసీఆర్‌ సర్కార్‌కు, నేటి రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఏ మాత్రం తేడా లేదన్నారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ప్రజలు ఓట్లేసి పంపిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత ధూషణలకు దిగుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పాలక ప్రభుత్వాలు పేదల నుంచి వేలాది ఎకరాలు సేకరిస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామేల్‌, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement