కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బోధునంపల్లికి చెందిన రిటైర్డు పట్వారీ బండ వెంకట్‌రెడ్డి మంగళవారం కేశంపేట చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయమై బాధితుడి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పరమేశ్ తెలిపారు.


