మహిళతో అసభ్య ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

మహిళతో అసభ్య ప్రవర్తన

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

మహిళతో అసభ్య ప్రవర్తన మహిళలు ఐక్యంగా ఉండాలి

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి

యాలాల: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను స్థానికులు దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణ శివారులోని జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్‌ నరేష్‌, అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడి తల్లితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం యాలాల మండల పరిధిలోని అగ్గనూరు శివారులో సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం యాలాల పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్‌ నరేష్‌ను వెంటనే సస్పెండ్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం, కేవీపీఎస్‌ నాయకులు యాలాల పీఎస్‌ ఎదుట డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపల్‌ వేధింపులు, అసభ్య ప్రవర్తన విషయంలో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, నాయకులు షుకూర్‌, గడ్డం వెంకటేష్‌, మండల బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణచారి ఉన్నారు.

రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌

కొడంగల్‌ రూరల్‌: మహిళల భధ్రతకు మహిళలే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఐఏఎస్‌ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ విజిట్‌లో భాగంగా సెర్ఫ్‌ జెండర్‌ డైరెక్టర్‌ జమున ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ.. మహిళల్లో జెండర్‌ సమస్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా, మహిళలకు అన్యాయం జరుగకుండా మహిళలంతా ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సమీపంలోని మహిళా కమిటీలు స్పందిస్తూ మండల రీసోర్స్‌ సెంటర్‌కు వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్‌ ఎస్‌సీఎంయూ లింగమయ్యగౌడ్‌, డీఆర్‌డీఏ ఏపీడీ నర్సింలు, డీపీఎం ఐబీ నర్సింలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, కార్యదర్శి శ్వేత, మండల సమాఖ్య అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి మాసనమ్మ, కోశాధికారి సత్యమ్మ, ఏపీఎం పి.గోపాల్‌, సీసీలు రాములు, అరవింద్‌కుమార్‌, బసంత్‌కుమార్‌, వాణిశ్రీ, జి.రాములు, అకౌంటెంట్‌ పుష్పలత, వివిధ గ్రామాల జెండర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement