వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగురు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆయా కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sep 9 2026 12:03 PM | Updated on Sep 9 2026 12:03 PM

● శ్రీశైలం దేవస్థానానికి వెళ్తూ..

ఆమనగల్లు: టెంపో ట్రావెలర్‌ను మిల్క్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ నుంచి శ్రీశైలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్‌లో 17 మంది వెళ్తున్నారు. అర్ధరాత్రి ఆమనగల్లులోని రాజీవ్‌చౌరస్తా వద్ద మాడ్గుల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మిల్క్‌ ట్యాంకర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంనలో టెంపో ట్రావెలర్‌లో ఉన్న నిజమాబాద్‌కు చెందిన కై లాస్‌, కన్నా, నాగరాజు, ధన్‌రాజ్‌, గోపాల్‌, శ్రీరామ్‌, భూమి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement