శంకర్‌పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బైక్ ముందు యూ టర్న్ తీసుకునేందు కోసం ఆగిన కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ రుధ్వీర్ కుమార్ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లికి చెందిన బార్మాల నిశాంత్ (19) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం బైక్‌పై స్నేహితుడు కంటేశ్‌ని తీసుకొని పటాన్‌చెరు వైపు వెళ్తున్నాడు. పట్టణ శివారులోని సురేందర్‌రెడ్డి హాలు వద్ద ఓ కారు శంకర్‌పల్లి వైపు యూటర్న్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అతివేగం కారణంగా నిశాంత్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టి, పక్కనే వెళ్తున్న మరో కారు అద్దాలపై పడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిశాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


