వెయ్యిరోజులైనా చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

వెయ్యిరోజులైనా చేసిందేమీ లేదు

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

మీర్‌పేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సభలు, ప్రచార కార్యక్రమాలతో ప్రభు త్వం కాలం వెల్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. హామీల అమలుకు స్పష్టమై న కార్యాచరణ ప్రకటించి, అర్హులందరికీ ప్రభు త్వ పథకాల ప్రయోజనాలు అందించాలని డి మాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామం, ప్రతి వార్డులో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా జాబితాను తయారు చేసి అధికారులకు అందజేశామని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఓట్లు పొందిన తరువాత వాటిని మరిచిపోవడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజల ముందుంచాలన్నారు. హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement