సైబర్‌ నేరాలపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై దృష్టి పెట్టండి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

● ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి

షాద్‌నగర్‌: సైబర్‌ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి సూచించారు. నందిగామ పోలీస్‌ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రికార్డుల నిర్వహణను క్రమబద్ధంగా నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు అమాయకులను టార్గెట్‌ చేసి డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పోలీసు అధికారులు విస్తృతంగా పర్యటించి ప్రజలను సైబర్‌ నేరాల బారిన పడకుండా చైతన్య పరచాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ–సాక్షి వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తులో కచ్చితత్వాన్ని మెరుగుపర్చాలన్నారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, ప్రజా సమస్యల పై తక్షణం స్పందించాలన్నారు. అనంతరం కన్హాశాంతి వనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement