పాముకాటుకు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుకు రైతు మృతి

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

పాముకాటుకు రైతు మృతి

దౌల్తాబాద్‌: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement