అదుపుతప్పి కారు బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి కారు బోల్తా

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

నలుగురికి గాయాలు

తాండూరు రూరల్‌: అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ సంఘటన పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇంద్రానగర్‌కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్‌ నుంచి తాండూరుకు వస్తున్నారు. మార్గమధ్యలో పెద్దేముల్‌ మండలం కందనెల్లి శివారు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత్రగాత్రుల్లో ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ విషయమై పెద్దేముల్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌వర్థన్‌ను వివరణ కోరగా.. కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement