జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు బాధితులు వెంటనే సమీప సర్కారు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు పాటించాలి.
– సుధాకర్‌లాల్, జిల్లా వైద్యాధికారి
విష సర్పాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వెంటనే సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించడం ద్వారా విషసర్పాలు, తేళ్ల కాటుతో జరిగే మరణాలను గణనీయంగా తగ్గించే ఆస్కారం ఉంది.
– రజిత, మండల వైద్యాధికారి, దోమ


