శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

యాచారం: శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా కఠినంగా వ్యహరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. యాచారం పీఎస్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, రోడ్డు నిబంధనలు అమలు చేసే తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని, హెల్మెట్‌ లేకుండా బైక్‌లు నడిపే వారికి జరిమానాలు విధించాలని అన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. భూసేకరణ చేపట్టే గ్రామాల్లో అధికారులను సమన్వయం చేసుకుని రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐలు మధు, ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం డీసీపీ నారాయణరెడ్డి సాగర్‌ హైవే గునుగల్‌ గేట్‌ వద్ద ప్రజలతో మాట్లాడారు. సైబర్‌ నేరాలు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ సేవలు ఎలా పొందాలి, కొత్త వ్యక్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తలను వివరించారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement