అదుపు తప్పి లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి లారీ బోల్తా

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

డ్రైవర్‌కు గాయాలు

యాలాల: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుక లోడ్‌ ఖాళీ చేసిన ఓ లారీ తాండూరు నుంచి కొడంగల్‌ వైపు వెళ్తుండగా మలుపు వద్ద బోల్తా పడింది. లారీ అద్దాలను పగలగొట్టిన స్థానికులు అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ నవీన్‌ను బయటకు తీసి తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా పడిన ప్రదేశంలో పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో వీరు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే లారీ బోల్తా పడటంతో భయాందోళనకు గురయ్యారు. యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement