చేవెళ్ల: పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ మద్యం మత్తులో ఆదివారం రాత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో హంగామా చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాత్రి తన స్నేహితుడికి ప్రమాదం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభిస్తుండగానే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రీ అని ప్రచారం చేసూకుంటూ.. డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌నని, తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. తాను ఓ దావత్‌కు వెళ్లానని, తన స్నేహితుడు ఆస్పత్రిలో ఉండటంతో అక్కడికి వెళ్లి మద్యం మత్తులో వైద్యులు, సిబ్బందిపై అమర్యాదగా మాట్లాడానని అంగీకరించారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెబుతున్నానని, తనకు ఎవరిపైనా దురుద్దేశం లేదని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు.
ఆసుపత్రిలో కౌన్సిలర్ హ ంగామా
క్షమాపణ చెబుతూ కృష్ణానాయక్
మైకం వదిలిన తర్వాత క్షమాపణ
చర్చనీయాంశమైన కౌన్సిలర్ వ్యవహారం


