చేవెళ్ల: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చేవెళ్లలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ అర్ధరాత్రి మద్యం తాగి, పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో హల్‌చల్ చేయడమే కాకుండా తానే స్వయంగా వీడియో తీసుకుంటూ వైద్యులు, యాజమాన్యాన్ని దూషించాడన్నారు. అంతటితో ఆగకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్‌ననే అహంకారంతోనే ఆయన ఇలా ప్రవర్తించాడని మండిపడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి క్షేమాపణ చెబితే సరిపోదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు పి.ప్రభాకర్, కె. ఆనంద్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఎం.చందు, అనంత్‌రెడ్డి, మల్లారెడ్డి, దండు సత్తి, భాస్కర్‌రెడ్డి, దూత మల్లేశ్, శ్రీధర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్, క్రిష్ణ, నరేందర్‌రెడ్డి, బాలు, శంకరయ్య, రాంప్రసాద్, మానిక్యరెడ్డి తదితరులు ఉన్నారు.


