రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి

ఫ్యూచర్‌ సిటీ జాయింట్‌ కమిషనర్‌

చందనాదీప్తి

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ విధానంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఫ్యూచర్‌ సిటీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(అడ్మిన్‌ అండ్‌ ట్రాఫిక్‌) జి.చందనా దీప్తి ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను సోమవారం ఆమె సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది విధి నిర్వహణ, వ్యక్తిగత క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణను పరిశీలించారు. ముగ్గురు ట్రాఫిక్‌ సిబ్బంది ప్రశంసిస్తూ రివార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(ట్రాఫిక్‌) శివమ్‌ ఉపాధ్యాయ, మహేశ్వరం డివిజన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ ఎ.చంద్రశేఖర్‌, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓ జితేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. బ్రహ్మణపల్లి రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉండే బానావత్‌ అమర్‌సింగ్‌ ఆటో నడుపుకుంటూ జీవణం సాగించేవాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. బ్రహ్మణపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయాడు. ఆటోను ఎడమవైపు తిప్పడంతో కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందాడు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అమర్‌సింగ్‌( 47) మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement