చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను చేవెళ్లలో వెంటనే ప్రారంభించాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ పురన్‌దాస్‌కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పాఠశాల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేకపోయారో అధికార పార్టీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన పాఠశాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఇన్నాళ్లుగా కాలయాపన చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చేవెళ్లకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి బీజేపీ పెద్దఎత్తున ందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు.
ఎంఈఓకు బీజేపీ నాయకుల వినతి


