దళారులపై చర్యలకు వినతి | - | Sakshi
Sakshi News home page

దళారులపై చర్యలకు వినతి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

ఆమనగల్లు: స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తాళ్ల రవీందర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో మోండా పేరుతో కొంతమంది దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లైసెన్స్‌ లేకుండా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో పాటు తరుగు, కమీషన్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరికి గతంలోనే మార్కెట్‌ కమిటీ నుంచి నోటీసులు అందజేశారని తెలిపారు.

క్వారీ పనులు నిలిపివేయాలి..

ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్‌ 302, 304లో కొనసాగుతున్న క్వారీ పనులను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతిపతంర అందజేశారు. క్రషర్‌తో విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు

తరుగు, కమీషన్‌ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement