ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ చందర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్‌కుమార్(23) ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. మగపిల్లలు లేనికారణంగా అనిల్‌ను చిన్నప్పుడే అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుని, తండ్రి భిక్షపతి అతన్ని పెంచారు. పోలీస్ సెలెక్షన్స్‌కు సిద్ధమవుతుండగా ఇటీవల కాలు బెనికి సర్జరీ అయిందని చెప్పారు. హఠాత్తుగా అనిల్ మృతిచెందడం, మెడ వద్ద చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చలానాలు తప్పించుకునేందుకు కారుకు ఫేక్ నెంబర్
యజమానిపై చీటింగ్ కేసు
గచ్చిబౌలి: చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్‌తో పట్టుబడ్డ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరకు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కారుకు ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్లు పరిశీలించగా చేయగా నెంబరు (టీఎస్08జైవె1202) ఫేక్ నెంబర్‌గా గుర్తించారు. ఛాసిస్ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ నెంబర్ టీఎస్11ఈజడ్3815గా గుర్తించారు. పాతబస్తీకి చెందిన ఇర్ఫాన్ ఈ నెల 18న నానక్‌రాంగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. కౌన్సిలింగ్ అనంతరం కోర్టు ద్వారా కారును విడుదల చేసుకునేందుకు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్‌కు వచ్చాడు. కారు నెంబర్‌ను పరిశీలించగా చేయడంతో ఫేక్ అని తేలింది. చలానాలు తప్పించుకునేందుకు ఫేక్ నెంబర్ వాడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు.


