ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లు నరికి గీత వృత్తికి దూరం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకుడు గుండ్ల దానయ్యగౌడ్, కార్యదర్శి భాస్కర్‌గౌడ్ డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఇంటి స్థలాలు చూపించండి..
యాచారం మండలంలోని చింతుల్లలో ఇచ్చిన సర్టిఫికెట్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలను చూపించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబరు 327లో ఐదెకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అప్పటి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే నర్సింహ వీటిని పంపిణీ చేసినా, ఇప్పటికీ పొజిషన్ చూపించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్కు విజయ్, సామర్తి జగన్, వినోద్‌కుమార్, నర్సింహ, కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల ధర్నా


