హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయాలి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

హామీలు అమలు చేయాలి

చేవెళ్ల: కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. చేవెళ్ల మీదుగా సోమవారం వెళ్తున్న ఆయన కాసేపు ఆగి స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చేవెళ్ల సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్‌ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. యువతను మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రశ్నించే వారిని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ఎం. విజయ్‌భాస్కర్‌రెడ్డి, నాయకులు విజయ్‌ ఆర్యక్షత్రియ, పి.ప్రభాకర్‌, దూత మల్లేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, ఆనంద్‌, నరేందర్‌రెడ్డి, శంకర్‌, సత్యం, అనంత్‌రెడ్డి, చందు, మాణిక్యరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కృష్ణ, రాంప్రసాద్‌, బాలు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement