షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని అంబేడ్కర్‌కానీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యనభ్యసిస్తున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పూర్తిగా నాని నెర్రెలు విడుస్తున్నాయి. వర్షపు నీరు లోపలికి వస్తుండటంతో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గోడలు ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాల పక్కనే ఉన్న ప్రభుత్వ వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో మూతపడింది. చెట్లు పెరిగి, చెత్తచెదారం చేరడంతో పాఠశాల ఆవరణలోకి విషపురుగులు వస్తున్నాయి. పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.


