ఆమనగల్లు: పట్టణంలోని బస్టాండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 91 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 6 నుంచి 10 వరకు తరగతులు కొనసాగుతుండగా 9 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహిస్తుండడం.. సౌకర్యాలు లేకపోవడంతో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. వర్షాకాలంలో పైకప్పు లీకేజీ అవుతూ తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. భవనం శిథిలం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. రెండేళ్లక్రితం పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థి గాయపడ్డాడు. దాతల సహకారంతో పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డు నిర్మించి కొన్ని తరగతులు నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా సరైన నిర్వహణ లేదు. రోజు విడిచి రోజు నల్లా రావడంతో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి.
వర్షం వస్తే గదుల్లోకి నీరు
ప్రస్తుత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడుతున్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. నూతన భవనం నిర్మించాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
– వైష్ణవి, పదో తరగతి విద్యార్థిని


