ఆమనగల్లు: సైబర్ నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని మహేశ్వరం ఏసీపీ ఎస్.జానకిరెడ్డి అన్నారు. పట్టణంలోని పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, రికార్డులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, స్టేషన్ నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రేవ్ కేసుల ఛేదనకు ప్రాధాన్యత ఇవ్వాలని, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


