పేదలకు మెరుగైన వైద్యం అందాలి | - | Sakshi
Sakshi News home page

పేదలకు మెరుగైన వైద్యం అందాలి

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

చేవెళ్ల: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలను పరిశీలించి వైద్యుల పనితీరుపై అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. సేవలు మరింత మెరుగుపర్చాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం చేవెళ్లలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. సౌకర్యాలు, వంట గది, విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలించారు. భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈఓ పురన్‌దాస్‌కు సూచించారు. అక్కడి నుంచి మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న సర్‌ కార్యక్రమం డిజిటలైజేషన్‌ ప్రక్రియను పరిశీలించి మున్సిపల్‌ కమిషనర్‌ బి.యాదగిరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒటరు ఎన్యూమరేషన్‌ ఫారం అందించేలా చూడాలని, ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌ చేసి అర్హులైనవారి ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, ఆస్పత్రి వైద్యులు లక్ష్మీకాంత్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement