ఆమనగల్లు: పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేయగా రూ.1.22 లక్షల ఆదాయం లభించిందని జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో వేలం నిర్వహించారు. ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ నేతృత్వంలో వేలం నిర్వహించగా రూ.1.22 లక్షలకు వాహనాలను విక్రయించారు. అనంతరం వివిధ కేసులలో పట్టుబడిన 88.7 లీటర్ల నాటుసారా, 3,283 కిలోల నల్లబెల్లం, 348 కిలోల నవసాగ్రం, 4.1 లీటర్ల మద్యం, 5.2 లీటర్ల బీర్లను స్థానిక సురసముద్రం చెరువు వద్ద ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్, కృష్ణప్రసాద్, అరుణ్‌కుమార్, స్వప్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


