● బాలుడి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
తాండూరు టౌన్: పక్కా సమాచారంతో తాండూరు పట్టణ పోలీసులు శుక్రవారం ఓ బాలుని వద్ద 10కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తాండూరుకు వచ్చారు. అప్పటికే మాటు వేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో 10 కిలోల గంజాయి లభ్యమైంది. బాలున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో పట్టణ ఎస్‌ఐ నుమాన్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.


