నూతన ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు
బాధ్యతలు స్వీకరిస్తున్న సీఐ నరేందర్‌రెడ్డి
చేవెళ్ల: చేవెళ్ల నూతన సీఐగా నరేందర్‌రెడ్డి, ఎస్‌ఐగా కోటేశ్వర్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారికి ఠాణా సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ సీఐగా పనిచేసి బదిలీ అయిన భూపాల్ శ్రీధర్ నూతన సీఐకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సిబ్బంది సీఐ భూపాల్ శ్రీధర్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. చేవెళ్ల ఠాణాలో మూడేళ్లు సీఐగా పనిచేసిన ఆయన సిబ్బందితో పాటు స్థానిక ప్రజల్లో మంచి అధికారిగా ముద్ర వేసుకున్నారు. దీంతో ఆయన బదిలీ విషయం తెలుసుకుని ఘనంగా సన్మానించారు.
షాబాద్ సీఐగా లక్ష్మీరెడ్డి
షాబాద్: షాబాద్ నూతన సీఐగా డీకే లక్ష్మీరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కాంతారెడ్డికి ఆరు హత్య కేసులో చార్జ్ మెమో ఇచ్చి బదిలీ చేశారు.


