పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్‌

ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్‌

షాబాద్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాబాద్‌ ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం నగరానికి చెందిన ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు పాఠశాలల ఆవరణలను హరితవనాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాగరగూడ, షాబాద్‌, హైతాబాద్‌ పాఠశాలలకు మొక్క లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమను పెంపొందించేందుకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ... విద్యతో పాటు పచ్చదనం, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వసంత, కృష్ణయ్య, ప్రవీణ్‌, బాల్‌రాజ్‌, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ మేనేజర్‌ ధనుంజయ్‌, విద్యార్థులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement