ఇబ్రహీంపట్నం రూరల్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం బొంగ్లూర్‌లోని ప్రమిద గార్డెన్‌లో యువ చైతన్య వేదిక, శక్తి నైపుణ్యం పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని సూచించారు. యువతను ప్రోత్సహించడానికి ఎంఆర్‌ఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. మాదక ద్రవ్యాలను రూపుమాపడానికి పోలీసులకు సహకరించాలని కోరారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో యువత ఎక్కువగా మృత్యువాతపడుతున్నారని తెలిపారు. తప్పకుండా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కుమారుడు అభిషేక్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీలు కేపీవీ రాజు, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సీఐలు రమేష్, మహేందర్‌రెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి, నాయకులు పైళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పట్నం శివశంకర్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


