మరకత శివాలయం అద్భుతం | - | Sakshi
Sakshi News home page

మరకత శివాలయం అద్భుతం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

మరకత శివాలయం అద్భుతం శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్‌ తరుణ్‌భాస్కర్‌, ఆయన తల్లి గీతా భాస్కర్‌, హీరోయిన్‌ ఈషా రెబ్బ అన్నారు. గురువారం వారు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పురాతన శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయ కమిటీ సభ్యు లు వారికి శేషవస్త్రం కప్పి, ఆలయ ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం షాబాద్‌: రేడియల్‌ రోడ్డులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం తహసీల్దార్‌ ఎండీ అన్వర్‌తో కలిసి భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్థసింహారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికీ సోలిపేట్‌, పెద్దవేడు, దామర్లపల్లి, మాచన్‌పల్లి రైతులకు మొత్తం రూ.37.11 కోట్లు వారి ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. షాబాద్‌, బోనగిరిపల్లి రెవెన్యూ విలేజ్‌లకు చెందిన రైతులకు ఒకటి, రెండు రోజుల్లో జమ అవుతాయని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు హెచ్‌ఎండీఏ చేస్తున్న వెంచర్లలో ఒకచోట ఎకరాకు 121 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, సర్పంచులు రాజేందర్‌రెడ్డి, ఒగ్గు రాజు తదితరులు పాల్గొన్నారు. టీజీఎస్పీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లోని 3వ బెటాలియన్‌ టీజీఎస్పీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు వంట మనుషులు, ఒక ధోబీ, ఒక క్షౌ రవృతిదారుడి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్హత, ఆధార్‌ కార్డుతో ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుభవం, పనితీరును బట్టి ఈనెల 29న జరిగే కమిటీ సమావేశంలో భర్తీ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. వివరాలకు 87126 57324 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పవన్‌ చౌహాన్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పవన్‌ చౌహాన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెండింగ్‌ ఫీజులు, ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు విడుదల చేయాలని గురువారం కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. స్కాలర్‌షిప్పులు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సామిడి వంశీ వర్థన్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌గౌడ్‌, ఆకాష్‌, వినోద్‌, పార్వతి, భాను, ఆందోజు, నిఖిల్‌, చందు, క్రిష్‌, మధు, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement