కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

హుడాకాంప్లెక్స్‌: కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలను ప్రభుత్వం తీర్చిదిద్దిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో గురువారం యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్‌, అమెనిటీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన మంత్రి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వీఎం హోంలో చదివే క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు. నీట్‌లో సరూర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ విద్యార్థులు సత్తా చాటి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌సీడీడీ కార్యదర్శి విజయేందిర బోయి, వీఎం హోం సెక్రటరీ సల్మాభాను, రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, మాజీ కార్పొరేటర్‌, పార్టీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, హోం ప్రిన్సిపాల్‌ చల్లా నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్‌ లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement