హెల్మెట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ తప్పనిసరి

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

మొయినాబాద్‌: రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలపాలవడంతోపాటు ప్రాణాలు కోల్పోతున్నారని ఫ్యూచర్‌సిటీ ట్రాఫిక్‌ డీసీపీ శివమ్‌ ఉపాధ్యాయ్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌ పాత గేటు వద్ద గురువారం ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనం నడిపే రైడర్‌తోపాటు వెనుక కూర్చున్నవారు సైతం తప్పనిసరి ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్న నాణ్యమైన హెల్మెట్‌లు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతాయని.. వేగ నియంత్రణ పాటించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఫ్యూచర్‌ సిటీ ట్రాఫిక్‌ డీసీపీ శివమ్‌ ఉపాధ్యాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement