సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లలో పూజల అనంతరం పాతబడిన లేదా విరిగిపోయిన దేవతా పటాలు, విగ్రహాలు, తదితర సామగ్రిని చెత్తలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా, వాటిని గౌరవప్రదంగా శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహణ చేసే ప్రాజెక్ట్ ఉద్వాసన కార్యక్ర మాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లోనూ శనివారం ప్రారంభించను న్నారు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీల్లో ఈ కార్యక్ర మాన్ని ఇప్పటికే చేపట్టడం తెలిసిందే. ఎంఎంసీలో మొదటి విడత కార్యక్రమాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.
శంషాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌలభ్యం కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రీమియం ఎయిర్‌పోర్టు ట్యాక్సీ సేవలను జీహెచ్‌ఐఏఎల్ ప్రారంభించింది. ప్రయాణికులకు ఏడాది పొడవునా 24 గంటలూ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. సుమారు 200 ట్యాక్సీలను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరైవల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లతో పాటు మొబైల్ యాప్, బుకింగ్ కియోస్క్‌ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఎయిర్‌పోర్టు నుంచి ఆయా ప్రాంతాలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ట్యాక్సీల కారణంగా మెరుగైన ప్రయాణం సాధ్యమవు తుందని జీహెచ్‌ఐఏఎల్ సీఈఓ కదీర్ కరవన్ పేర్కొన్నారు.
ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో గాలి నాణ్యతను మెరుగుపరచి, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) అమలుపై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య తీవ్రత ఎక్కు వగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, శాసీ్త్రయ పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, ట్రాన్స్‌పోర్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ రావు, అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ సునంద, ముఖ్య ఆర్థిక సలహాదారు వెంకటేశ్వరరావు, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


