ఘనంగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

శంకర్‌పల్లి: మండల పరిధిలోని ప్రొద్దటూరులో గల ప్రగతి రిసార్ట్స్‌లో నగరంలోని విజయనగర్‌కాలనీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1975– 76 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 50 ఏళ్ల తర్వాత వారందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుచేసుకొన్నారు. రోజంతా ఆటాపాటలతో సరదాగా గడిపారు. రమాదేవి రచించిన శ్రీస్మృతి పథంశ్రీ, శివప్రసాద్‌ రచించిన శ్రీమన బడి.. తీయటి జ్ఞాపకాల అమ్మ ఒడిశ్రీ అనే రచనలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము 65 ఏళ్ల వయస్సులో ఉన్నామని, ఇలా 50 ఏళ్ల తర్వాత 10వ తరగతి స్నేహితులంతా కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకుగాను గత ఆరు నెలలుగా కష్టపడినట్లు వారు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement