మహిళను వేధిస్తున్న
వ్యక్తిపై కేసు
పోచారం: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేష్‌తో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కుటుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.
మైలార్‌దేవ్‌పల్లి: అత్త, భర్త వేధింపుల కారణంగా ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన మేరకు.. బండ్లగూడ ఆదర్శనగర్ బస్తీలో మహిపాల్, శ్రీదేవి (25)ని దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కొంతకాలంగా శ్రీదేవిని భర్త మహిపాల్, అత్త లక్ష్మిలు వేధిస్తున్నారు. మనస్తాపానికి గురైన శ్రీదేవి గురువారం మధ్యాహ్నం ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్‌ఐ రాఘవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీదేవి తల్లి ఆశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


