బీసీల సమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

బీసీల సమస్యలపై నిరంతర పోరాటం

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

షాబాద్‌: బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు పల్నాటి యాదయ్య పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్‌ భవన్‌లో హక్కుల సాధన సమితి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జీవో నంబర్‌ 9ని అమలుపరచాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర విడనాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. బీసీ హక్కుల సాధన సమితి షాబాద్‌ మండల కమిటీ అధ్యక్షుడిగా పాలమాకుల ఆనందం, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, ఉపాధ్యక్షుడిగా తెలుగు శేఖర్‌, సహాయ కార్యదర్శి రుక్కయ్య, కోశాధికారిగా నాగరాజుతో పాటు 13 మంది తో కమిటీ ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా పాపయ్య, మొయినాబాద్‌ మండల అధ్యక్షుడిగా ఉప్పరి సురేష్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శంకర్‌పల్లి మండల అధ్యక్షుడిగా మంగలి నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా వడ్ల బ్రహ్మాచారి తదితరులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల కార్యదర్శి సత్తిరెడ్డి, మొయినాబాద్‌ మండల కార్యదర్శి శ్రీనివాస్‌, శంకర్‌పల్లి మండల కార్యదర్శి సుధీర్‌, అంజయ్య, మాక్బుల్‌, మంజుల తదితరులు ఉన్నారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement