హద్దులు, ఫెన్సింగ్ వేసే సమయంలో అధికారులు కబ్జాలో ఉన్న ఎకరంన్నర భూమికి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీడు భూమిలో రూ.లక్షలు ఖర్చు చేసి షెడ్లు, బోర్లు, పొలాన్ని అభివృద్ధి చేసుకున్న. పరిహారం అందజేస్తామని చెప్పి ఇవ్వకుండానే చదును పనులు చేపడుతున్నారు.
– కె.అంజయ్య, కబ్జా రైతు, నక్కర్తమేడిపల్లి
సర్వే నంబరు 39లో 1.12 ఎకరా భూమిలో కబ్జాలో ఉన్నా. నేనున్న కబ్జాపై వేరే రైతుకు పరిహారం అందజేశామని అధికారులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి చుట్టూ తిరిగా. పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇవ్వకుండానే చదును పనులు చేస్తామంటున్నారు.
– గోపలి అంజయ్య, కబ్జా రైతు, కుర్మిద్ద
ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో కొంత మంది కబ్జా రైతులకు పరిహారం విషయమై నా దృష్టికి వచ్చింది. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. ఆర్డీఓగా కొత్తగా వచ్చినందున గతంలోని అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకుంటా. మొండిగౌరెల్లితో పాటు కబ్జా రైతులందరికీ న్యాయం చేస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ ఇబ్రహీంపట్నం


